- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manthena Rama Raju:ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రామరాజు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నూతన ఏపీఐఐసీ ఛైర్మన్‌ని నియమించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(APIIC) ఛైర్మన్‌గా మంతెన రామరాజు(Manthena Rama Raju) ఈరోజు (శనివారం) ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తనను నమ్మి ఇంత గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), కూటమి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన APIIC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని రామరాజు అన్నారు. గతంలో టీడీపీ(TDP) అధికారంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు దీని ద్వారా ‘కియా’, ‘హీరో’ పరిశ్రమలను(industries) ఎన్నో తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఏపీఐఐసీ తరఫున ప్రతి నియోజకవర్గంలో లేఔట్ తయారు చేసి ముందుకు వెళ్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ(YCP) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో APIICని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.