Darshan Thoogudeepa : రేణుకాస్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది

by karthikeya |   ( Updated:2024-10-05 08:08:01.0  )
Darshan Thoogudeepa : రేణుకాస్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది
X

దిశ, వెబ్‌డెస్క్: రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందంటూ కన్నడ నటుడు దర్శన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత కొన్ని రోజులుగా తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, ఒంటరిగా ఉంటే భయమేస్తోందని, తనని బెంగళూరు జైలుకు తరలించాలని వేడుకుంటున్నాడు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్.. ప్రస్తుతం విచారణ ఖైదీగా బళ్లారి జైల్లో ఉన్నాడు. ఈ కేసులో దర్శన్‌, పవిత్రగౌడలతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే దర్శన్‌ని పరప్పన్ అగ్రహారంలోని సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. అయితే ఇటీవలే కోర్టు ఆదేశాలతో అతడిని పరప్పన్ సెంట్రల్ జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించారు. అయితే బళ్లారి జైలు నచ్చకపోవడం వల్లే దర్శన్ ఇలాంటి స్టోరీలు అల్లుతున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story