- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూటమి మేనిఫెస్టో రిలీజ్..యువతకు ప్రత్యేక హామీలు!
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడింది.ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కలిసి ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం..అనే నినాదంతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు. కూటమి మేనిఫెస్టో లో విద్యార్థులకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రత్యేక హామీలు..
మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతామని అన్నారు.యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అందిస్తామని తెలిపారు. స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు మేనిఫెస్టోలో వివరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా,రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ఉద్యోగ కల్పన కు ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్ జోన్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు, మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తాం,కేంద్ర, రాష్ట్ర పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వివరించారు.
Read More...