- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ గుడిలో కన్నబిడ్డలను దేవుడికి అమ్మేస్తారు!
దిశ, డైనమిక్ బ్యూరో: తమ కన్నబిడ్డలను గుడిలో దేవుడికి అమ్మేసి ఆ తర్వాత డబ్బులిచ్చి కొనుక్కునే దేవాలయం గురించి మీకు తెలుసా?. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా గొల్లలమామిడాల కోదండ రామాలయంలో ప్రతియేటా జరిగే ఈచారం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలను ఈ గుడికి సమర్పింస్తారు. ఆ తర్వాత డబ్బులి ఇచ్చి తిరిగి వారే కొనుగోలు చేస్తారు.
ఇలా చేయడం ద్వారా తమకు తమ పిల్లలకు అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. 1889లో నిర్మించిన నాటి నుంచి ఈ దేవాలయంలో పిల్లలను గుడికి అమ్మేయడం అనే ఆచారం కొనసాగుతూ వస్తోందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో బిడ్డలను దేవుడికి అమ్మేసి కొనుగోలు చేసే ఆచారంతో పాటు ఇతర విశిష్టతలు కూడా ఉన్నాయి. సంతానం లేని వారికి ఈ గుడిలో మొక్కుకుంటే శ్రీరామచంద్ర ప్రభువు సంతాన భాగ్యం కలిగిస్తారని భక్తుల విశ్వాసం. ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణంలోని తలంబ్రాలను పరమాన్నం వండుకుని తినడం భక్తులు ఆనవాయితీగా ఆచరిస్తుంటారు.