కొడాలి నాని ఓ ఊరకుక్క: టీడీపీ నేత బుద్దా వెంకన్న

by sudharani |   ( Updated:2023-02-16 10:20:12.0  )
కొడాలి నాని ఓ ఊరకుక్క: టీడీపీ నేత బుద్దా వెంకన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి కొడాలి నాని ఓ ఊర కుక్క అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ది చెబుతాం అని హెచ్చరించారు. విజయవాడలోని కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ చేస్తున్న పాదయాత్ర ప్రారంభం కావడంతో పిచ్చి కుక్కలను జగన్ రోడ్ల మీదకు వదిలాడు అని విమర్శించారు. కొడాలి నాని, ఇతర కుక్కలు చంద్రబాబు, లోకేశ్‌పై నోరు పారేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. గుడివాడలో జేబులు కొట్టేసే కొడాలి నాని చంద్రబాబును తిట్టడం హాస్యాస్పదంగా ఉంది అని చెప్పుకొచ్చారు.

వాళ్లంతా దగా నాకొడకులు కాబట్టే... అందరినీ అలాగే అనుకుంటున్నారు అని ధ్వజమెత్తారు. ఉల్లిపాయ పకోడి నాకొడుకు కొడాలి నాని అని విమర్శించారు. చంద్రబాబు, వాళ్ల నాన్న పేరు నీకెందుకురా అని ప్రశ్నించారు. నీ నాన్న పేరు ఏంటో చెప్పరా... ఒక్కసారి అయినా చెప్పావా అని నిలదీశారు. ఎన్టీఆర్‌‌కు నువ్వు వారసుడివి ఏంటి అని ప్రశ్నించారు. లోకేశ్ వారసుడు కాదా... నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు.. నువ్వు ఎలా వారసుడివి అయ్యావో అంటూ ఎద్దేవా చేశారు. ఉల్లిపాయ పకోడిగా నోరు అదుపులో పెట్టుకోలేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. తాము కూడా జగన్‌ని అనగలం అని చెప్పుకొచ్చారు. మహా అయితే అరెస్టు చేస్తారు.. లేదా చంపేస్తారు అని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోవడం ఖాయం

వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోవడం తథ్యమని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇరవై వేల ఓట్లతో గెలుస్తానని చెప్తున్నాడని అంతసీన్ లేదని చెప్పుకొచ్చారు. ఈసారి ప్రజలు కొడాలి నానిని తరిమి కొడతారు అని హెచ్చరించారు. దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ అనుమానం చేస్తుంటే దానిపై అర్థంలేని విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. నా తమ్ముడు నాకన్నా గొప్ప అని గతంలో దివంగత సీఎం వైఎస్ అన్నారని గుర్తు చేశారు. ఈ హత్య వల్ల సీఎం జగన్‌కు ఏంటి లాభం అని కొడాలి నాని అన్నాడంటే ఈ హత్య గురించి నానికి కూడా తెలుసునని చెప్పుకొచ్చారు. అంటే ఆస్తి, పదవి వస్తే జగన్‌ చంపేస్తాడని ఈ కుక్కే చెబుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బిక్షతో ఎమ్మెల్యే అయ్యి.. ఆయన్నే తిడతావా అని మండిపడ్డారు.

నాకు జ్ఞానం ఉంది... నీకు ఏం తెలుసని వాగుతావురా అంటూ ధ్వజమెత్తారు. కమ్మవారి కోటాలో‌ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వాలి. కమ్మ కోటాలో ఎమ్మెల్యే, మంత్రి కావాలి. కానీ తిట్టేది మాత్రం కమ్మ కులాన్నే. గుడివాడ ప్రజలు నిన్ను రాళ్ళతోకొట్టి చంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని హెచ్చరించారు. జైలుకు వెళ్లి జగన్‌ని కలిసి డీల్ మాట్లాడుకుంటేనే టీడీపీ నిన్ను సస్పెండ్ చేసింది. వైసీపీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న వారు ఈ ఊర కుక్కతో జాగ్రత్తగా ఉండండి. 2024ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. కోటంరెడ్డి ని‌చూసి బుద్ది తెచ్చుకోండి... ఆయన జగన్‌ని తిడుతున్నారా? పోలీసులు కూడా దొంగ కేసులు పెట్టడం లేదు. జగన్‌ను నమ్ముకుంటే మనం కూడా మునుగుతాం అని పోలీసులకు అర్థం అయ్యింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో కొడాలి నానిని తీసుకెళ్లి సీబీఐ నాలుగు తగిలించాలి. అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి లను వెనుకేసుకొస్తున్న కధ మొత్తం చెబుతాడు అని బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story