కిమ్ గొప్ప పోరాట యోధుడు: CPI Narayana ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-08-27 10:51:40.0  )
కిమ్ గొప్ప పోరాట యోధుడు: CPI Narayana ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌ను ఉత్తర కొరియో అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో పోల్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం జగన్‌ను కిమ్‌తో పోల్చడం సరికాదని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గొప్ప యోధుడు కిమ్ అని.. కిమ్ వంటి యోధుడితో జగన్‌ను పోల్చడం అవగాహనారాహిత్యమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో చంద్రబాబుకు అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహనలేదని అర్థమవుతోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed