- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: హత్యలు, అణిచివేతలే వైసీపీ విధానం.. సాక్ష్యం ఇదే..!
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ అయిన వైసీపీకి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేనకి మధ్య విమర్శల సమరం విరామం లేకుండా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అరిగిపోయిన టేపురికార్డర్ లా ప్రతిపక్షాల గురించి చెప్పిందే చెప్తున్నారు. ఇక చూసిన సినిమానే ఎన్నిసార్లు చూస్తాం అన్నట్టు.. చెప్పిందే మళ్లీమళ్లీ చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పకనే చెప్తుంది జనసేన పార్టీ.
మరుగున పడిన కేసులను వెలికితీసి.. అధికార పార్టీ అన్యాయాలకు, అక్రమాలకు, ఆకృత్యాలకు ఆధారాలు ఇవే అని బహిరంగంగా చూపిస్తోంది. గతంలో వైసీపీ నేత దగ్గర డ్రైవర్ గా పని చేసిన సుబ్రమణ్యం మృతి వెనక దాగిన నిగూడ రహస్యం ఎట్టకేలకు బహిర్గతం అయ్యింది. సుబ్రహ్మణ్యంని హత్య చేసినది తానేనని వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ తెలియచేసిన విష్యం అందరికి తెలిసిందే..
అలానే ఆంధ్రా క్రికెట్ రంజీ జట్టులో 17 వ మెంబర్ గా ఉన్న ఓ వైసీపీ కార్పొరేటర్ కుమారుడు పృధ్విరాజ్ ను కెప్టన్ విహారి మందలించారు. దీనితో అతని తండ్రి నరసింహాచారి వైసీపీ నేతలకు ఫిర్యాదు చేశారు. నరసింహాచారి ఫిర్యాదు చేయడమే తరువు.. ఆంధ్ర క్రికెటర్స్ అసోసియేషన్ మొత్తాన్ని తమ గుప్పెట్లో ఉంచుకున్న వైసీపీ నేతలు ఆగమేఘాలపై స్పందించారు.
ఏడేళ్లుగా రంజీ జట్టుకు కెప్టన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న విహారిని మొదటి మ్యాచ్ తరువాత తొలిగించారని వస్తున్న వార్తల్లో వాస్తవాలను జనసేన ఒడిసిపట్టుకుంది. ఆ వార్తలకు సంబంధించిన వీడియో క్లిప్ ను ట్విట్టర్ వేదికగా(X) పోస్ట్ చేస్తూ ఆ వీడియోకి తమకింద బ్రతకకుంటే అణచివేయడం లేదా చంపేయడమే వైసీపీ విధానం.. అది ఒక సామాన్య దళిత డ్రైవర్ అయినా.. భారత దేశానికి ప్రతినిధ్యం వహించిన క్రికెటర్ అయినా.. అనే క్యాప్షన్ ట్యాగ్ చేసింది.
తమ కింద బ్రతకకుంటే అణచివేయడం లేదా చంపేయడమే వైసీపీ విధానం!
— JanaSena Party (@JanaSenaParty) February 27, 2024
అది ఒక సామాన్య దళిత డ్రైవర్ అయినా...భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్ అయినా..!!#Jaganasurudu#YCPCriminalPolitics#HelloAP_ByeByeYCP pic.twitter.com/W7b9e6K0ki