Nara Lokesh:ముంబయిలో మంత్రి లోకేష్ కీలక భేటీ.. పలు అంశాలపై చర్చలు

by Jakkula Mamatha |
Nara Lokesh:ముంబయిలో మంత్రి లోకేష్ కీలక భేటీ.. పలు అంశాలపై చర్చలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) నేడు(గురువారం) ముంబయిలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ(artificial intelligence computing company) ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పాలన విధానంలో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నదే తమ కోరిక అని మంత్రి లోకేష్(Nara Lokesh) పేర్కొన్నారు. ఈ క్రమంలో అమరావతి(Amaravati)లో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా జెన్సన్ హువాంగ్‌ను నారా లోకేష్ కోరారు.

ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కోరిక పై స్పందించిన హువాంగ్(Huang) రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ(AI technology) ద్వారా అంతర్జాతీయంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయో తెలిపారు. స్పీచ్ రికగ్నిషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ టూల్స్, అల్గారిథంలను ఎన్ విడియా అందిస్తోందని హువాంగ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed