ఆమె పోటీ చేస్తే గెలిపిస్తాం.. వైఎస్ సునీతకు బీజేపీ కీలక నేత హామీ..?

by Indraja |   ( Updated:2024-03-15 11:43:38.0  )
ఆమె పోటీ చేస్తే గెలిపిస్తాం.. వైఎస్ సునీతకు బీజేపీ కీలక నేత హామీ..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శత్రువుకి శత్రువు మిత్రుడే అవుతాడు అనే మాటను నిజం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నేతలు. ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా అయన కూతురు వైఎస్ సునీత కడపలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కాగా ఈ సమావేశానికి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కూడా హాజరైయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా ఎంపీగా చేసినప్పుడు తాను ఎమ్మెల్యేగా పని చేశానని తెలిపారు. ఇక రాజశేఖర్ రెడ్డి అలానే వాళ్ళ నాన్న రాజా రెడ్డి తమ కుటుంబానికి చాల ఆప్తులని పేర్కొన్నారు. అయితే సమీకరణ మారిందని.. అలానే సమస్యలు మారాయని.. ఆ నేపథ్యంలో తాను కూడా రాజకీయంగా విబేధించినట్టు వెల్లడించారు. ఇక తాము కూడా ఫ్యాక్షన్ చేశామని కానీ ఇలాంటి దరిద్రమైన ఆలోచన ఎప్పుడు చెయ్యలేదని తెలిపారు.

అప్పుడు మా మీదా.. ఇప్పుడు వీళ్ళ మీదా.. ఏంటిది మీ ముండ బతుకులు అని వైసీపీపై మండిపడ్డారు. న్యాయం చేస్తే చెయ్యండి లేకపోతే లేదు అంతేగాని ఇలా చెయ్యడం ఏంటి అని ప్రశ్నించారు. ముందే ఇంటి పెద్దను కోల్పోయి వాళ్ళు బాధపడుతుంటే.. వాళ్లపై కేసు పెట్టడమేటని ధ్వజమెత్తారు. సునీత తరుపున వాదించేందుకు లాయర్ ని రాకుండా చేశారని ఆరోపించారు.

ముందుగా ఆదినారాయణ రెడ్డిని అడ్డుపెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు వివేకాని పొడిచిపొడిచి చంపారని జగన్ కోర్టు వెళ్లారని.. అయితే వివేకా చనిపోయిన రోజు పొద్దున్న గుండెపోటు అన్నారని.. మధ్యాహ్నం నాలుగు గంటలకు మళ్ళీ మాట మారిందని తెలిపారు. ఇంటి కుక్కను ఈశ్వరుడైన పట్టలేడని.. కానీ సీబీఐ పట్టిందని తెలిపారు. ఇప్పటికే సీబీఐ 80% కేసును సాల్వ్ చేసిందని ఇంకో 20% మాత్రమే ఉందని.. అది కూడా పూర్తయ్యేలా బీజేపీ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

అలానే ప్రజా కోర్టులో కూడా వాళ్లకు న్యాయం జరగాలని తెలిపారు. ఇక ఆమె కాంగ్రెస్ తరుపున పోరాటం చేస్తోందని.. చేతనైతే పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతానికి కూడా కట్టుబడి ఉండాలని తెలిపారు. ఇక సునీత రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్న తాము పరోక్షంగా వాళ్లకు అండగా నిలబడతామన్నారు. అలానే ప్రజలు కూడా వాళ్లకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.

Read More..

జగన్ నీకు సిగ్గుగా లేదా..? అన్నపై వైఎస్ సునీత ఫైర్..

Advertisement

Next Story

Most Viewed