Pushpa-2 ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రభాస్, మహేష్ బాబును వెనక్కి నెట్టిన బన్నీ (ట్వీట్)

by Hamsa |   ( Updated:2024-11-18 14:42:13.0  )
Pushpa-2 ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రభాస్, మహేష్ బాబును వెనక్కి నెట్టిన బన్నీ (ట్వీట్)
X

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. ఈ చిత్రాన్ని బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో శ్రీలీల(Sreeleela) స్పెషల్ సాంగ్‌లో చిందులేయనుంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్(Fahadh Faasil), సునీల్, అనసూయ, జగపతి బాబు(Jagapati Babu) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. ఐకాన్ స్టార్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘పుష్ప-2’(Pushpa-2) ట్రైలర్‌ నవంబర్ 17న విడుదలైంది.

దీనిని బీహార్‌లోని పాట్నా వేదికగా గ్రాండ్‌గా లాంచ్ చేసి అభిమానులను ఆనందపరిచారు. ఇక ఈ ట్రైలర్‌ను ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఇందులోని నటీనటులు చెప్పిన డైలాగ్స్‌కు ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, పుష్ప-2 ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్ సాధించినట్లు మేకర్స్ అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డ్‌ను సృష్టించినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాల ట్రైలర్లలో 24 గంటల్లోనే ఎక్కువమంది చూసిన ట్రైలర్‌గా ముందు స్థానంలో మహేష్ బాబు(Mahesh Babu) ‘గుంటూరు కారం’ నిలవగా.. ప్రభాస్(Prabhas) ‘సలార్’ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక ఇప్పుడు పుష్ప-2 ట్రైలర్ ఈ రెండిటిని వెనక్కి నెట్టి టాప్ 1 ప్లేస్‌లో ఉంది. కేవలం 15 గంటల్లోనే 42 మిలియన్లు వ్యూస్‌తో దూసుకుపోతుంది. 24 గంటల్లో ఇంకా పెరిగే చాన్స్ ఉన్నట్లు టాక్. ప్రజెంట్ మేకర్స్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.



Read More...

Allu Arjun: పుష్ప 2 లో అల్లు అర్జున్, రష్మిక కాలు పట్టుకున్న సీన్ హైలెట్ గా నిలవనుందా?



Advertisement

Next Story

Most Viewed