Floods:వరద ప్రభావిత ప్రజలకు ప్రజారోగ్య శాఖ కీలక సూచనలు..!

by Jakkula Mamatha |   ( Updated:2024-09-16 15:44:13.0  )
Floods:వరద ప్రభావిత ప్రజలకు ప్రజారోగ్య శాఖ కీలక సూచనలు..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) విజయవాడలో వరదలు(Floods) అల్లకల్లోలం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ క్రమంలో వరద బాధితులకు(Flood Victims) ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక సూచనలు చేసింది. వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని సూచించింది. కాచి, చల్లార్చి, వడపోసిన నీరే తాగాలి. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పారబోయాలి. అత్యవసరమైతే 108కి ఫోన్ చేయండి అని వరద ప్రభావిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed