- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్ డెస్క్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూములపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తాను భూములు ఇచ్చేవాడినని, లాక్కునేవాడిని కాదని జగన్ చెప్పారు. భూములపై ప్రజలకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని ఆయన తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఎవరి భూములపై వారికే పూర్తి హక్కులు ఉంటాయని చెప్పారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క పనిని తాను చేయనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. పేదలకు మంచి చేయడమే తనకు తెలుసన్నారు. మోసం చేయడం తెలియదని సీఎం జగన్ పేర్కొన్నారు.
Advertisement
Next Story