కాంగ్రెస్‌‌లో చేరడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన YS షర్మిల

by Satheesh |   ( Updated:2024-01-20 14:57:30.0  )
కాంగ్రెస్‌‌లో చేరడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన YS షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియామకమైన షర్మిల.. రేపు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ వెళ్లి ఇడుపులపాయ‌లోని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో తన తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని తెలిపారు.

కాంగ్రెస్ అన్న, పార్టీ సిద్ధాంతాలన్న తన తండ్రి వైఎస్‌కు ఎంతో ఇష్టమని.. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం తాను పని చేస్తానని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తన తండ్రి కళ అని.. అది నేరవేరే వరకు పోరాటం చేస్తానని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించిన హై కమాండ్‌కు ఈ సందర్భంగా ఆమె మరోసారి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇటీవల తన వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల.. ఆమె సైతం హస్తం గూటికీ చేరిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు అధిష్టానం కీలక పోస్ట్ కట్టబెట్టింది. త్వరలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కు కాంగ్రెస్ చీఫ్‌గా నియమించింది. షర్మిల నేతృత్వంలో ఎన్నికల పోరుకు బరిలోకి దిగాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో సోదరుడు, సీఎం జగన్‌ను షర్మిల ఎలా ఢీకొడుతుందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అన్న, చెల్లెల పోరుతో పాటు.. మరోవైపు టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి.

Read More..

కాకపుట్టిస్తున్న పొత్తుల రాజకీయాలు.. విజయవాడ పశ్చిమ టిక్కెట్ రేస్

Advertisement

Next Story