అమ్మాయిల పెళ్లిళ్ల పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Mahesh |
అమ్మాయిల పెళ్లిళ్ల పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అమ్మాయిల పెళ్లిళ్ల తర్వాత తల్లిదండ్రుల బాధ్యత పై కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అంతం చేయలేదని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్లిన ఓ యువతి తన తండ్రి ప్రభుత్వం ఉద్యోగం.. కారుణ్య నియామకంలో భాగంగా తనకు కావాలని తనకు ఆ హక్కు ఉందని కుటుంబ సభ్యులతో వాదించింది. అనంతరం కారుణ్య నియామకానికి సంబంధించి తన కుటుంబ సభ్యులు ఆమెను తన ఇంటి మనిషిగా పరిగణించడం లేదని.. సదరు కారుణ్య నియామకంలో తనకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయానికి సంబంధించిన కేసును విచారించిన అనంతరం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటి అమ్మాయి.. పెళ్లి అయిన తర్వాత.. ఆమెకు తమ కుటుంబ సభ్యురాలు కాదు అని చెప్పడాన్ని కోర్టు తప్పుబట్టింది. కారుణ్య నియామకాల్లో కుమారులను, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించడం సరికాదని తెలిపింది. అలాగే ఆడపిల్లలు పెళ్లి అయినా కాకున్నా.. జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో భాగమేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed