- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: నా స్థాయి అది కాదు.. ఆయనే నా టార్గెట్: కేశినేని నాని
దిశ డైనమిక్ బ్యూరో: కేశినేని నాని టీడీపీ లో ఉన్నంత వరకు బుద్ధా వెంకన్నతో ఇమడలేకపోయారు. దీనితో నాని తరుచూ బుద్ధా వెంకన్నను టార్గెట్ చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా బుద్ధా వెంకన్న పై విమర్శల జల్లు కురిపించేవారు. కాగా టీడీపీతో వచ్చిన విబేధాల నేపథ్యంలో కేశినేని నాని వైసీపీ గూటికి చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న కేశినేని నాని పార్టీ మారడంతోనే తన టార్గెట్ ను మార్చుకున్నారు అని అనిపించేలా తన వైఖిరి ఉందని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
టీడీపీలో ఉన్నప్పుడు బుద్ధా వెంకన్న పై విరుచుకుపడే నాని.. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా విమ్మర్శల జల్లులు కురిపిస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత పైన కేశినేని నాని చేస్తున్న విమర్శలకు బుద్ధా వెంకన్న, కేశినేని చిన్ని ఇతర టీడీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
అయితే టీడీపీ నేతల కౌంటర్లను కేశినేని నాని పట్టించుకోవడం లేదు. ఇక తన స్తాయి చంద్రబాబు స్థాయి అని .. తాను చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందిస్తేనే తాను పట్టించుకుంటానని తన అనుచరులకు కేశినేని నాని చెప్పారని సమాచారం. ఇక కేశినేని నాని చంద్రబాబు పై చేస్తున్న విమర్శలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చిన ఆ కౌంటర్లకి నాని ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో కేశినేని నాని తన స్తాయి చంద్రబాబు స్థాయి అని అనుకుంటున్నారని.. అందుకే టీడీపీ నేతలు ఇస్తున్న కౌంటర్లకి స్పందించడం లేదని వస్తున్న వార్తలు వాస్తవమే అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి.
Read More: రంగులు మార్చే రాజకీయ వ్యభిచారి కేశినేని నాని : బుద్దా వెంకన్న ఫైర్