- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి నెక్ట్స్ సీఎం అతడే.. ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి విమర్శలు గుప్పించారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. చంద్రబాబులాగా వ్యక్తులను నమ్మించి ఎవరూ మోసం చేయలేరని అన్నారు. మరోవైపు తన తమ్ముడు, టీడీపీ నేత కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలకు నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ చేరికల గేట్లు తెరిస్తే 80 శాతం వైసీపీ ఖాళీ అవుతోందని చిన్ని అనగా.. వైసీపీకి ఉన్న బలంలో 10 శాతం పవర్ కూడా టీడీపీకి లేదని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ సర్వే ఫలితాలు వైసీపీ వైపే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. కాగా, టీడీపీలో సొంత తమ్ముడి చిన్నితో వివాదం.. హై కమాండ్ విజయవాడ ఎంపీ టికెట్ నిరాకరించడంతో కేశినేని నాని తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీకి రాజీనామా చేసి అధికార వైసీపీలో నాని చేరారు. ఈ నేపథ్యంలో విజయవాడ వైసీపీ అభ్యర్థిగా కేశినేని నానికి సీఎం జగన్ చాన్స్ ఇచ్చారు.