- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: కేశినేని బ్రదర్స్ మధ్య ఆగని వార్.. నానిపై చిన్ని ఫైర్..
దిశ వెబ్ డెస్క్: కేశినేని సోదరుల మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటోంది.టీడీపీ అధిష్టానం ఎంపీ కేశినేని నానిని పక్కన పెట్టి చిన్నికి టికెట్ ఇవ్వడంతో అగ్నికి ఆర్జ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరారు. ఈ క్రమంలో వైసీపీకి అనుగుణంగా మాట్లాడుతూ.. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ పై మాటల యుద్దానికి దిగుతున్నారు కేశినేని నాని.. అయితే తాజాగా కేశినేని నాని పై కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు చంద్రబాబు అనుచరుడిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఇప్పుడు దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారి ఆయన ఎటు వెళితే అటు అతని వెనక హచ్ కుక్కపిల్లల తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు.
ఇక నాని వైసీపీ గూటికి చేరిన తరువాత నాని వెనుక కనీసం ముగ్గురు నలుగురు కూడా లేరని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కేశినేని నానికి బుద్ధి చెప్పడానికి విజయవాడ ప్రజలుసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానని కేశినేని నాని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డ చిన్ని.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీని లేకుండా చేయడం నాని వల్ల కాదని పేర్కొన్నారు. ఇక కొడాలి నానికి ఏ మాత్రం తగ్గకుండా కేశినేని నాని కూడా బూతులు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడికృష్ణ జిల్లాలో టీడీపీ లేకుండా చేయడం మాట అంటుంచింతే టీడీపీ గేట్లు తీస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ఎద్దేవ చేశారు. ఇక వైసీపీ అరాచక పాలన ఎంతో కాలం సాగదని.. దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యమని కేశినేని చిన్ని వెల్లడించారు.