- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణంగా పడిపోయిన కేసీఆర్.. ఏ ర్యాంక్‌లో ఉన్నారో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూడే సంస్థ నిర్వహించిన సర్వేల్లో తెలుగు రాష్ట్రాల సీఎంల ర్యాంకులు మరింత దిగిజారిపోయాయి. ఇండియా టూడే మూడ్ ఆఫ ది నేషన్ పేరుతో దేశంలోని రాజకీయ నాయకులు గురించి సర్వేలు నిర్వహిస్తుంటుంది. ఏ రాజకీయ నాయకుడు పుంజుకుంటున్నాడు. అక్కడి ప్రజలు వారిని నమ్ముతున్నారా. వారి గ్రాఫ్ పెరుగుతుందా.. తగ్గుతుందా అన్న విషయాలపై సర్వేలు నిర్వహిస్తుంటుంది. దీనిలో భాగంగానే తాజాగా సర్వే నిర్వహించారు. తాజాగా సర్వేల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్ టెన్‌లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు. ఈ సర్వే ఏమైనా ప్రామాణికమా అంటే గతంలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేల్లో కేసీఆర్, జగన్ టాప్ ర్యాంక్ లో నిలిచారు. అప్పుడు ఆ పార్టీల నేతలే దానిని గర్వంగా చెప్పుకున్నారు.
ఈ తాజా సర్వేలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక దేశంలో రెండవ బెస్ట్ సీఎంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నిలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మూడవ స్థానంలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు 43 శాతం కంటే తక్కువ ఓటింగ్‌తో టాప్ టెన్‌లో స్థానం దక్కించుకోలేకపోయారు.