- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ పై పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ జీరో.. కారుమూరి సునీల్
దిశ, డైనమిక్ బ్యూరో: కారుమూరి సునీల్ కు వైసీపీ అధిష్టానం ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం అందరికి సుపరిచితమే. అయితే ఈ రోజు మీడియాతో మాట్లాడిన కారుమూరి సునీల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చాలా దృఢంగా ఉందని.. కనుక వైసీపీ పై పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ జీరో అని పేర్కొన్నారు.
వైసీపీ దృఢంగా ఉందని అందుకే ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమవుతున్నాయని తెలిపారు. ఇక కాపు ఓటు బ్యాంక్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ.. పార్టీ ప్రచారంలో ప్రతి ఇంటికి తాను వెళ్ళినప్పుడు పరిస్థితి గురించి అర్ధమైంది తెలిపారు. తాను ప్రతి ఇల్లు తిరిగే సమయంలో ఓ ఇంటి పై జనసేన పార్టీ జెండా ఎగురుతోందని.. అయిన తాను ఆ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు.
కాగా ఆ ఇంట్లో మహిళ మాట్లాడిన మాటలకు తాను ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆ మహిళ చేస్తున్న వ్యాపారం జరగక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం ఆమెను సమస్యల నుండి బయటపడేసిందని.. అయితే ఆమె కొడుకులు మాత్రం పవన్ కళ్యాణ్ అంటూ తిరుగుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సునీల్ పేర్కొన్నారు.
అలానే ఆ మహిళ రానున్న ఎన్నికల్లో తన ఓటు కచ్చితంగా జగన్ అన్నకే అని చప్పిందని వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ పిల్లలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించాలని చూస్తున్నారు కానీ.. జనసేన అధికారం లోకి వస్తే ప్రజలకు ఏం చెయ్యాలి అనుకుంటుందో చెప్పడం లేదని సునీల్ ఆరోపించారు.
కాపులందరు జనసేనకు ఓటేస్తారని అనుకుంటే మాత్రం అది పవన్ కళ్యాణ్ కంటున్న కల గానే పరిగణించాలని సునీల్ పేర్కొన్నారు. ముఖ్యంగా కాపు మహిళల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి చొచ్చుకుపోయి ఉన్నారని.. ఏ ప్రభత్వం ఇవ్వని పథకాలు జగన్ ఇచ్చారు కనుక వెస్ట్ గోదావరిలో వైసీపీ మరోసారి విజయం సాధిస్తుందని కారుమూరి సునీల్ ధీమా వ్యక్తం చేశారు.