కాపు రిజర్వేషన్ల దీక్ష: హరిరామజోగయ్యకు Pawan Kalyan ఫోన్

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-02 06:42:47.0  )
కాపు రిజర్వేషన్ల దీక్ష: హరిరామజోగయ్యకు Pawan Kalyan ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్: కాపు రిజర్వేషన్ల సాధన కోసం దీక్ష చేపట్టిన మాజీ మంత్రి హరిరామజోగయ్యకు జనసేనాని పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో హరిరామ జోగయ్య దీక్ష చేస్తున్నారని ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హరిరామ జోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని, ప్రభుత్వం వెంటనే ఆయనతో చర్చలు జరపాలన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నుంచి మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య దీక్ష చేసేందుకు సిద్ధం కాగా పోలీసులు ఆదివారం రాత్రి పోలీసులు అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పవన్ హరిరామజోగయ్యతో మాట్లాడి తన సంఘీభావాన్ని తెలిపారు.

Also Read...

గుంటూరు తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికరం: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా KCR భారీ స్కెచ్.. BRS అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్..!

Advertisement

Next Story