- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫ్లైయాష్ ఫైటింగ్.. సీఎం చంద్రబాబుకే వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే
దిశ, వెబ్ డెస్క్: కడప ఆర్టీపీపీ ఫ్లైయాష్(Kadapa District RTPP Flyash) వివాదాన్ని సీఎం చంద్రబాబునాయుడి(Cm Chandrababu Naidu)కే వదిలేశానని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి(Jammalamadugu BJP MLA Adinarayana Reddy) అన్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక అవసరాల తీరిన తర్వాతే ఫ్లైయాష్‌ను తరలించాలని చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుతో మీటింగ్‌కు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి(Former MLA JC Prabhakar Reddy) ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కనీసం ఆయన కుమారుడినైనా పంపిస్తే బాగుండేదన్నారు. సొంత కూటమిపైనే విమర్శలు చేయడం జేసీకి తగదని సూచించారు. ఈ వివాదం చిన్నదేనని, సీఎం చంద్రబాబు చాలా ఈజీగా పరిష్కరించగలరని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రాకుండా ఇంత లేఖ రాస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. జేసీ వచ్చి ఉంటే చర్చ జరిగేదని, పంచాయితీ అటో ఇటో తేలిపోయేదని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.