- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: సీబీఐ విచారణకు మరోసారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు మరోసారి హాజరుకానున్నారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ ఓసారి విచారించింది. ఎప్పుడు పిలిచినా మళ్లీ రావాలని సూచించింది. తాజాగా మరోసారి విచారించేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని వాట్సాప్ ద్వారా అవినాశ్ ఫోన్కు నోటీసులు పంపింది. ఈ మేరకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాశ్ రెడ్డి వెళ్లనున్నారు.
కాగా తెలంగాణ సీబీఐకు వివేకా కేసు బదిలీ అయినప్పటి నుంచి విచారణలో వేగం పుంజుకుంది. ముగ్గురు నిందితులను ఇప్పటికే అధికారులు విచారించారు. అంతేకాదు వారిని హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మరోసారి అవినాశ్ రెడ్డికి నోటీసులివ్వడంతో ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read...
Vallabhaneni Vamsi: చంద్రబాబు పెద్ద సైకో.. లోకేశ్ పిల్ల సైకో..!