ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు కాదంబరి జత్వానీ

by Y. Venkata Narasimha Reddy |
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు కాదంబరి జత్వానీ
X

దిశ వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు విచారణ సాగుతున్న కొద్ది ఆసక్తికరంగా మారుతుంది. శనివారం నటి కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అంతకుముందు కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై డీజీపీ ద్వారక తిరుమల రావు వేటు వేశారు. అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఐఓ సత్యనారాయణలను సస్పెన్షన్‌ చేశారు. తనతో పెళ్లికి నిరాకరించారని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అక్రమంగా అరెస్ట్‌ చేసి వేధించారని నటి జత్వానీ ఆరోపణలు చేసిన నేపధ్యంలో ఆ ఇద్దరు పోలీసులపై వేటు పడింది. ఈ కేసులో ఏకంగా ముగ్గురు ఐపీఎస్ లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ముగ్గురు వీఆర్ లో ఉన్నారు. త్వరలో ప్రభుత్వం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని, వారిపై విచారణ కూడా జరిగే అవకాశముందని అంటున్నారు.

ఇప్పటికే ఈ కేసు విషయంలో ఓసారి విజయవాడ వచ్చి వెళ్లిన నటి కాదంబరి, తాజాగా ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్ట్ చేసి, తనను ఇబ్బందులు పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్ తో పాటు, ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలసి ఆమె పోలీస్ స్టేషన్ కి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని వల్ల తాను ఇబ్బందులు పడ్డానని, తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడ్డారని కాదంబరి చెప్పడం విశేషం. మొత్తానికి కాదంబరి వర్సెస్ కుక్కల విద్యాసాగర్ అనే కేసు.. చివరకు పోలీసుల మెడకు చుట్టుకున్నట్లయ్యింది.

Advertisement

Next Story