Neelakurinji: పన్నెండేళ్ల నిరీక్షణ.. కొండా కోనల్లో కనువిందు చేస్తున్న నీలి రంగు పూల వైభవం

by Javid Pasha |
Neelakurinji: పన్నెండేళ్ల నిరీక్షణ.. కొండా కోనల్లో కనువిందు చేస్తున్న నీలి రంగు పూల వైభవం
X

దిశ, ఫీచర్స్: పున్నమి వెన్నెల పక్షం రోజులకోసారి వస్తుంది. వసంత రుతువు ఏడాదికోసారి పలకరిస్తుంది. ఆకాశంలో హరివిల్లు, అవనిపై చిరుజల్లు కూడా అంతే.. ఎప్పుడంటే అప్పుడు అలరించవు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వచ్చి ఆకట్టుకుంటాయి. మనలో ఏవో కొంగ్రొత్త ఆశలు రేకెత్తిస్తాయి. అలాంటి అరుదైన అద్భుతాల్లో నీలకురింజి పూలు పూయడం కూడా ఒకటి. పన్నెండేళ్లకోసారి కొండా కోనల మధ్య విరబూసే ఈ పుష్పాలు ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి.

ఒకటి కాదు, రెండు కాదు పన్నెండు వసంతాల నిరీక్షణ ఫలించింది. ప్రకృతి ప్రేమికుల మనసు మరోసారి ఆనంద పారవశ్యంలో మునిగితేలుతోంది. కారణం.. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పర్వత లోయల్లో నీలకురింజి పువ్వులు వికసించాయి. వీచే గాలులతో సయ్యాటలాడుతూ ముగ్ధ మనోహరంగా అలరిస్తున్నాయి. ఇక కేరళ రాష్ట్రం ఇడుక్కిలోని శలోం కొండలు, తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లాలోని పర్వత లోయలు ఇప్పుడు నీలిరంగు చీరకట్టుకుని ముస్తాబైనట్టే కనిపిస్తున్నాయి. విరబూసిన నీలి రంగు పూలతో చూపరులను మైమరిపిస్తున్నాయి. పన్నేండేళ్లకోసారి, అది కూడా కేవలం ఆగష్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రమే పూసే ఈ నీల కురింజి పువ్వుల సోయగాన్ని చూడటానికి ప్రస్తుతం దేశ, విదేశాల నుంచి అనేకమంది తరలివస్తున్నారని పర్యాటక నిపుణులు పేర్కొంటున్నారు.

Video credits to chennai updates ANI - On X Id

Next Story

Most Viewed