పూసాల శ్మశాన వాటికకు గ్రహణం..నిరుపయోగంగా మారిన వైనం

by Aamani |
పూసాల శ్మశాన వాటికకు గ్రహణం..నిరుపయోగంగా మారిన వైనం
X

దిశ,సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణ మున్సిపల్ పరిధిలోని పూసాల శ్మశాన వాటికకు గ్రహణం పట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా కనీస సౌకర్యాలు లేక ప్రజలు నానా నరకయాతన అనుభవిస్తున్నారు. చెరువు కట్ట నుండి పాత రహదారి ఉన్న, చెట్ల పొదలతో నడవడానికి వీలు లేని పరిస్థితి దాపురించింది. పూసాల పరిధిలోకి దాదాపు 40 రైసుమిల్లుల ఆదాయం వస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమని ప్రజలు పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే కనీసం నడవడానికి కూడా రహదారి లేని దీనస్థితి. గతంలో స్నానాల వాటిక బాత్ రూమ్ లు తూతూ మంత్రంగా, నాసిరకం నిర్మాణాలు చేశారు.పిచ్చి మొక్కలతో నిండిపోయి స్నానాల వాటిక వాడుకునే పరిస్థితి లేదు. దహన సంస్కారాలు అయిన తర్వాత కనీసం స్నానం చేయడానికి నీటి సౌకర్యం లేక ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. అయిన సంబంధిత మున్సిపల్ అధికారులు కానీ,ప్రజాప్రతినిధులు కానీ ఈ శ్మశాన వాటికను పట్టించుకోని, కనీస సౌకర్యాలు కల్పించిన పరిస్థితి లేదు.

ప్రభుత్వం గ్రామాలలో లక్షలాది రూపాయలు వెచ్చించి సుందరంగా స్మశాన వాటికలు నిర్మాణం చేస్తున్న తరుణంలో పూసల గ్రామ ప్రజలకు శ్మశాన వాటిక శాపంగా మారింది. ఆదాయం ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధి చేయకపోవడం లో ఆంతర్యం ఏమిటని పూసాల గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్నానాలు వాటికకు నిధులు మంజూరైన, నిరుపయోగంగా మారడంతో స్నానాల వాటిక నిర్మాణం పై జిల్లా కలెక్టర్ విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. నాసిరకం నిర్మాణాలతో సంబంధిత కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కు కావడంతో నిర్మాణాలు కుంటుపడి ప్రజలకు నిరుపయోగంగా మారుతున్నాయని ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ పై, పర్యవేక్షణ అధికారులపై చర్యలు తీసుకోవాలని పూసాల గ్రామ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పూసాల స్మశాన వాటిక నిర్మాణంపై దృష్టి సారించాలని, లేనియెడల పూసాల గ్రామానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చేయడానికి వెనుకాడేది లేదని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

Next Story