- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. షాకింగ్ వీడియో విడుదల
దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందారు. గురువారం డిశ్చార్జి అయి అనంతపురం జిల్లా తాడిపత్రిలో తన నివాసానికి వెళ్లారు. తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తాడిపత్రి ప్రజల ప్రేమ, ఆశీస్సుల వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని, మళ్లీ తాడిపత్రి ప్రజలను చూడగలుగుతున్నానని తెలిపారు. అయితే తనను 15 రోజుల పాటు మాట్లాడొద్దని వైద్యులు సూచించారని, అందువల్లే ఎవరూ తన వద్దకు రావొద్దని సూచించారు. 15 రోజుల తర్వాత తానే ప్రజలను కలుస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాడిపత్రి ప్రజల ఆశీస్సులతో నా ఆరోగ్యం మెరుగుపడింది, దయచేసి 15 రోజులు కలవడానికి ఎవరు రాకండి, నేను ఎక్కువ మాట్లాడకూడదు అని డాక్టర్లు సూచించారు. మీ ప్రేమ అభిమానాలకు నా కృతజ్ఞతలు 👏👏..... pic.twitter.com/FxJgf4HIHJ
— JC Prabhakar Reddy (@JCPRTDP) August 1, 2024