- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మళ్లీ ఆ కార్యక్రమం.. పొలిట్ బ్యూరో గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మళ్లీ జన్మభూమి- మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు. టీడీపీ అధికారంలో ప్రతిసారి ఈ కార్యక్రమం కొనసాగింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి-2 కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం జరిగిన పొలిట్ బ్యూరో కార్యక్రమంలో జన్మభూమి-2 కార్యక్రమంపై చర్చించి ఆమోదం తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, రైతాంగ సంక్షేమం, ఆహార భద్రత, ప్రకృతి వ్యవసాయం, సహజ వనరులు, మానవ వనరులు విద్య, ఆరోగ్యం, గ్రామాలు, పట్టణాల్లో వౌలిక వసతులు, ఇందనరంగం, పరిశ్రమలు, ఉపాధి, సుపరిపాలన, శాంతిభద్రతలు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
ఈ జన్మభూమి-2 కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పదవులపైనా చర్చించారు. సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ జాబితా విడుదల చేసేందుకు ఇప్పటికే కసరత్తులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ పదవులు పొందేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి లిస్టులో ఎవరి పేర్లుంటాయో చూడాలి.