జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాన్ని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే

by Mahesh |   ( Updated:2024-03-12 14:25:52.0  )
జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాన్ని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: ఎపీలో ఎన్నకిలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రముఖ రాజకీయ నాయకులు పోటీ చేసే స్థానాల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చవి చూసిన పవన్ కల్యాన్ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు ఈ రోజు జనసేనలో చేరారు. దీంతో అందరూ ఆయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ లేకపోతే టీడీపీనీ బీజేపీ దగ్గరకు రానివ్వదు. ప్రధాని మోడీ, అమిత్ షాలు పవన్ కల్యాణ్ మాటలు మాత్రమే వింటారని చెప్పుకొచ్చారు.

అలాగే జనసేనలో చేరిన నేనే ప్రాణం ఉన్నంత వరకు పవన్ వెంటే ఉంటా.. భీమవరం నుంచి నాకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ నేను పోటీ చేయను.. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. అలాగే దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేసి.. గెలిస్తే కేంద్ర కేబినెట్ మంత్రిగా అవుతారినే వార్తలు జోరుగా వినిపించాయి. కానీ ఈ రోజు మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు చెక్ పెట్టడమే కాకుండా.. వపన్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చాయి.

Read More..

పొత్తులకు వెళ్లడానికి ఓ కీలక వ్యక్తి కారణం: పవన్ కల్యాణ్

Advertisement

Next Story