- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జనసేనలో నూతనోత్తేజం.. అక్కడ ఆయనే దొరబాబు
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచనాలు సృష్టించే రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తన కత్తికి మరింత పదును పెంచింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అక్కడ విజయకేతనం ఎగర వేయాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చిక్కాల దొరబాబు అనే పారిశ్రామికవేత్తను రంగంలోకి దింపింది. అయితే దొరబాబు ఇంకా పార్టీలో అధికారికంగా చేరకపోయినా, అధిష్టానం సూచనల మేరకు గ్రామాల్లో ఇంటింటా పర్యటన చేస్తున్నారు. రామచంద్రపురానికి అతి దగ్గరగా ఉన్నశిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో దొరబాబుకు నియోజకవర్గంలో అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. దీంతో దొరబాబు పర్యటనలో అనేక మంది భాగం పంచుకొంటున్నారు. ఇంటింటా పర్యటించిన జనసేన ఆశయాలు వివరిస్తున్నారు. అతని సోదరుడు చిక్కాల సుబ్బారావు ఇప్పటికే పార్టీలో చాలా కాలం నుంచి ఉంటున్నారు. దీంతో దొరబాబును కూడా పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేనలో మంచి ఊపు వచ్చింది. గ్రామాల్లో దొరబాబు పర్యటనకు విశేష స్పందన లభిస్తోంది.
గుప్తదాతగా దొరబాబుకు మంచి పేరు..
సిరిపురం గ్రామానికి చెందిన దొరబాబు గుప్త దాతగా మంచి పేరుంది. తన స్వగ్రామంలో 1999లో షిర్డీ సాయిబాబా ఆలయం నిర్మించారు. నాటి నుంచి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా వేలాది మంది పేదలకు అన్న, వస్త్ర దానాలు చేస్తున్నారు. దీనికి తోడు కరప ప్రధాన రోడ్డులో సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహం కూడా తన సొంత ఖర్చులతో నిర్మించారు. గ్రామంలో అనేక పురాతన ఆలయాలకు మరమ్మతులు చేయించారు.
మూడు నియోజకవర్గాలకు స్టాండ్ బై
దొరబాబు కాకినాడ సిటీ, రామచంద్రపురం, రామచంద్రపురం రూరల్ నియోజకవర్గాలకు జనసేన పార్టీ స్టాండ్ బై అని చెప్పాలి. ఆ మూడు నియోజవకర్గాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది. కాకినాడ సిటీలో కూడా జనసేన అభ్యర్థిత్వం కాపులకు కేటాయిస్తారనే ప్రచారం ఉంది. రూరల్ కు ఇప్పటికే పంతం నాన్నాజీ ఉన్నారు. రామచంద్రపురం పోలిశెట్టి చంద్రశేఖర్ ఉన్నారు. అయితే సామాజిక సమీకరణలో భాగంగా ఏదైనా మార్పులు వస్తే దొరబాబుకు చాన్స్ రావచ్చనే ప్రచారం సాగుతోంది. పారిశ్రామిక వేత్తగా దొరబాబు కూడా పార్టీ కోసం గట్టిగా సొమ్మలు ఖర్చు చేస్తారనే ప్రచారం సాగుతోంది. దొరబాబు తమ్ముడు సుబ్బారావు ఇప్పటికే పార్టీలో సీనియర్ నేత అవ్వడంతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో దొరబాబుకు ఏదో ఒక చోట సీటు దక్కవచ్చనే ప్రచారం సాగుతోంది.