- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేనకు భారీ షాక్.. వైసీపీలో చేరిన రాజోలు ఇంచార్జ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకూ పార్టీలో ఉన్న నేతలు జంప్ అవుతున్నారు. ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో అసంతృప్తులు ఒక్కొక్కరిగా పార్టీలు వీడుతున్నారు. ఇంతకాలం పార్టీకి సేవలు చేసిన తమను కాదని మరొకరికి సీటు ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఇతర పార్టీల్లో సైతం సీటు రాదని తెలిసీ గోడ దూకేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదు. అన్ని పార్టీల్లోనూ ఇదే నడుస్తోంది. తాజాగా జనసేన పార్టీలోనూ జంపింగ్ జిలానీలు ఎక్కువ అయ్యారు.
ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నుంచి వలసలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే జిల్లాలోని కీలక నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అమలాపురం ఇంచార్జ్ రాజబాబు, ముమ్మిడివరం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, పిఠాపురం ఇంచార్జ్ శేషుకుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ ఇలా చాలా మంది నేతలే జనసేన పార్టీని వీడారు. తాజాగా రాజోలు ఇంచార్జి బొంతు రాజేశ్వరరావుతో పాటు కీలక నేతలంతా జనసేన పార్టీ నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరినీ సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి వైసీపీ జెండా కప్పారు. ఈ పరిణామంతో తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు భారీ షాక్ తగిలిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిన జనసేన!
— YSR Congress Party (@YSRCParty) April 18, 2024
సీఎం వైయస్ జగన్ గారి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరిన రాజోలు @JanaSenaParty ఇంఛార్జ్, బొంతు రాజేశ్వరరావు, ఇతర నేతలు.@PawanKalyan నమ్మించి మోసం చేశాడంటూ వరుసగా జనసేనను వీడిన అమలాపురం ఇంఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇంఛార్జ్… pic.twitter.com/7r8KQzHNow