యువతతోనే రాజకీయాల్లో మార్పు.. జనసేన నేత నాగబాబు

by Javid Pasha |
యువతతోనే రాజకీయాల్లో మార్పు.. జనసేన నేత నాగబాబు
X

దిశ, ఉత్తరాంధ్ర: యువతతోనే రాజకీయాల్లో మార్పు వస్తుందని జనసేన పీఏసీ సభ్యుడు కొణిదల నాగబాబు అన్నారు. 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో అధికార, జనసేన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పార్టీ నిర్మాణంలో భాగంగా కార్యకర్తగా పని చేస్తానని, అధికారం తనకు వద్దని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ రాబోయే రోజుల్లో ముఖ్య మంత్రి అవుతారని పేర్కొన్నారు. జనసేన పార్టీలో అందరికి భవిష్యత్‌ ఉంటుందని, ఎవరైనా ముఖ్య మంత్రి అయ్యే అవకాశం ఉంది అన్నారు. యువతను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, యువతకి ప్రధాన అవకాశం ఇవ్వటమే జనసేన లక్ష్యమని తెలిపారు.జీవో 1 ద్వారా పవన కల్యాణ్‌ వారాహీని ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత చెత్త చట్టం ఎప్పుడూ తెలేదని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజల హక్కు కాల రాయడమే అన్నారు. ఇప్పుడు మనం బానిసిలం కాదని, జీ వో 1 వెనక్కీ వెళ్లి పోవడానికి జన కేక చాలన్నారు.


యువశక్తి సభ ప్రత్యేకత

స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని తాళ్లవలస వద్ద యువశక్తి పేరిట జనసేన పార్టీ భారీ బహిరంగను నిర్వహించింది. యువశక్త వేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. జాతీయ రహదారి పక్కనే 35 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వచ్చే వారికోసం 4 ఎంట్రన్స్‌ గేట్లు ఇచ్చారు. వాటికి ఉత్తరాంధ్రకు చెందిన మహనీయులు గిడుగు రామ్మూర్తి, వీరనారి గునన్నము, అల్లూరి సీతారామరాజు, కోడి రామమూర్తి పేర్లు పెట్టారు.

Advertisement

Next Story