Janasena: ఏపీలో జనసేన సభ్యత్వ నమోదు రికార్డుల మోత

by Mahesh |
Janasena: ఏపీలో జనసేన సభ్యత్వ నమోదు రికార్డుల మోత
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ విజయం సాధించిన జనసేన పార్టీ.. అధికారంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ 100 శాతం విజయంతో రాష్ట్ర జనసేన నేతల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అలాగే తమ అధినాయకుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో పాటు కీలక మంత్రి పదవులు జనసేనకు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వాల నమోదు జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో నెల రోజులుగా జరుగుతున్న సభ్యత్వ నమోదు దాదాపు 10 లక్షలకు చేరుకున్నట్లు నాగబాబు చెప్పుకొచ్చారు. ఇది గత సంవత్సరం కంటే ఎక్కువే అని తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 5 వేల సభ్యత్వాలు కావాలని.. సభ్యత్వ నమోదుకు మరో వారం రోజులు గడువు ఇస్తున్నట్లు జనసేన కీలక నేత నాగబాబు తమ పార్టీ నేతలకు ఆదేశించారు.

Advertisement

Next Story