భారతీయుల సమైక్యతకు ఆలంబన వినాయక చవితి: పవన్ కల్యాణ్

by GSrikanth |   ( Updated:2022-09-03 12:31:23.0  )
భారతీయుల సమైక్యతకు ఆలంబన వినాయక చవితి: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ''వినాయక చవితి అందరూ కలిసి మెలిసి చేసుకొని పండుగ. తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే వేడుక. ఆధ్యాత్మికత, ఆనందాయకమైన ఈ పండుగ ఒకనాడు తెల్లవారిపై పోరాటానికి, భారతీయుల సమైక్యతకు ఆలంబనగా నిలిచింది. కాగా, ఈ పండుగలో మట్టి గణపతిని పూజించాలని కోరుతున్నాను. దీనివల్ల సంప్రదాయాలను పాటించిన వారిమి కావడమే కాకుండా పర్యవరణానికి మేలు చేసిన వారమూ అవుతాము. పాలన మాటున ప్రజలను పీడించే నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ విఘ్నాధిపతిని మనసారా ప్రార్థిస్తున్నాను.'' అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Also Read : పవర్ స్టార్ కోసం హీరో నిఖిల్ త్యాగం.. ఆకాశానికెత్తేస్తోన్న పవన్ ఫ్యాన్స్

Also Read : తెలుగు రాష్ట్రాల్లో జనసేనే బలమైన పార్టీ.. 119 పార్టీల్లో ఇదే టాప్!!

Advertisement

Next Story