ఆయనలా చేయను.. తేడా వస్తే తాట తీస్తా: పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2024-03-07 12:23:58.0  )
ఆయనలా చేయను.. తేడా వస్తే తాట తీస్తా: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌లా తాను చొక్కాలు మడతపెట్టనని, సమయం వస్తే తన పవర్ ఏంటో చూపిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ సమక్షంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ పరిస్థితులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో రౌడీయిజం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలిస్తే రాయలసీమ సర్వనాశనం అవుతుందన్నారు. వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా వైసీపీని వదిలి బయటకు వస్తున్నారని తెలిపారు. తనను నరికినా భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. ఎవరితోనూ గొడవపడే మనస్తత్వం తనకు లేదని, తేడా వస్తే తాట తీస్తానని హెచ్చరించారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రజలనే కాదని.. పార్టీ కార్యకర్తలను సైతం ఇబ్బంది పెడుతున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన తన కుటుంబంతో సమానమని... వారికోసం పోరాటానికి దిగానని చెప్పారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే రాయలసీమ మొత్తం వలసలు పోవడమేనన్నారు. చిత్తూరు జిల్లా ఐదుగురు వైసీపీ నేతల కబంధ హస్తాల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు కొడితేనే దెబ్బా అని.. తాము తొడితే కూడా దెబ్బ కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ బానిస సంకేళ్లలో ఉండిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో తెంపుతామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Read More..

ఆయనలా చేయను.. తేడా వస్తే తాట తీస్తా: పవన్ కల్యాణ్

Advertisement

Next Story