స్పీడ్ పెంచిన జనసేనాని.. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం

by srinivas |   ( Updated:2024-03-28 15:57:38.0  )
Pawan Kalyan
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ సారి పుఠాపురం నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు అక్కడి నుంచే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీని ఫిక్స్ చేశారు. వారాహి విజయభేరి పేరుతో ఈ నెల 30న పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఎన్నికల తొలి బహిరంగ సభను కూడా ప్రారంభించారు. దీంతో పవన్ ఆ సభలో ఏం మాట్లాడతారనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed