- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jana Sena: కష్టపడిన ప్రతీ ఒక్కరిని గుర్తిస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: జనసైనికులు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడిన ప్రతీ ఒక్కరిని గుర్తిస్తామని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. జనసేన కార్యాలయంలో వైసీపీ నాయకులు(YCP Party Leaders) పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారిని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) సహా పలు జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏ ఆశ లేని సమయంలో పార్టీకి అండగా నిలిచేందుకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్(MLC Hariprasad) జనసేనలో చేరారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో వారు నాతో అండగా నిలబడి పార్టీ బలోపేతం చేసేందుకు కృషిచేశారని అన్నారు.
ఒక లక్ష్యం కోసం మేము అందరం పనిచేస్తున్నామని, ఈరోజు మా మీద నమ్మకంతో వచ్చి పార్టీలో చేరిన వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu) నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం(NDA government) రాష్ట్రంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిజం చేయడానికి పనిచేస్తున్నామని అన్నారు. అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో మాకు అండగా ప్రతీ ఒక్కరూ నిలబడాలని కోరారు. ఇక పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరిని గుర్తిస్తామని, కార్యకర్తలు పని చేయండి.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.. ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.