- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JanaSenaనా? TDPనా? Vangaveeti Radha పయనమెటు?: అనుచరులతో భేటీపై ఉత్కంఠ
దిశ, డైనమిక్ బ్యూరో : బెజవాడ అడ్డా వంగవీటి అడ్డా అనేది అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఇప్పటి వరకు తప్పటడుగులు వేస్తున్న రాధా ఇకపై రాజకీయాలపై తీసుకునే నిర్ణయం కరెక్ట్‌గా ఉండాలనేది ఆలోచన. వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరిన వంగవీటి రాధా అక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వంగవీటి రాధా రాజకీయ భవితవ్వంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీడీపీలోనే ఉండాలా? లేక ఏ పార్టీలో చేరాలా? అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో వంగవీటిరాధాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా జనసేనలో చేరే అవకాశాలు సైతం లేకపోలేదు అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వంగవీటి రాధా సోదరి ఆశ సైతం రాజకీయారంగేట్రం చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై వంగవీటి రాధా తన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ భేటీలో వంగవీటి రాధా ఏ పార్టీలో చేరతారు? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? టీడీపీలోనే కొనసాగుతారా? లేక గుడ్ బై చెప్తారా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మరోవైపు సోదరి రాజకీయ ఆరంగేట్రంతో ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతారా అన్న అంశంపైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెుత్తానికి వంగవీటి రాధా తన అనుచరుల వద్ద ఏం చెప్పబోతున్నారు..? అనుచరులు ఏం చెప్పబోతున్నారు? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
బెజవాడ వంగవీటి అడ్డా
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి మంచి పట్టుంది. వంగవీటి రంగా అంటేనే కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ జై కొడతారు. ఇకపోతే వంగవీటి రంగా సొంత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఆయనను దేవుడిలా కొలుస్తోంది. అంతేకాదు వంగవీటి రంగా అనంతరం కాపు సామాజిక వర్గం నేతలు వంగవీటి రాధాకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికీ కాపులు వంగవీటి రాధాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వంగవీటి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన వంగవీటి రాధా తన సత్తా చాటుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి శాసన సభలో అడుగుపెట్టిన వంగవీటి రాధా అనంతరం పీఆర్పీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంతా భావించినా కానీ చేయలేదు. వాస్తవానికి వంగవీటి రాధా పదవిలో ఉన్నా..లేకున్నా దశాబ్దాలుగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఈ సందర్భంలో ఏదైనా పార్టీలో చేరితే రాధా ఆ పార్టీకే పరిమితం అవుతున్నారని కానీ కానీ వంగవీటి రాధా అందరివాడు అని ఆయన అనుచరులు అంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి కొందరికి వ్యతిరేకం అయ్యేదానికన్నా తటస్థంగా ఉంటేనే బెటర్ అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే వంగవీటి రాధా సోదరి ఆశ సైతం రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆశను వైసీపీలోకి తీసుకు వచ్చేందుకు వైసీపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆశకు విజయవాడ సెంట్రల్ సీటు సైతం ఆఫర్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది.
టీడీపీలో ఇమడలేకపోతున్న రాధా
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోని నేతలతో వంగవీటి రాధాకు అంతగా పొసగడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వంగవీటి రంగాను హత్య చేయించిన టీడీపీలో ఉంటారా అంటూ వంగవీటి రాధాను దెప్పిపొడుస్తున్నారు. వంగవీటి రంగాను టీడీపీ నేతలే హత్య చేశారని రంగా అనుచరులు సైతం ఆరోపిస్తున్నారు. అలాంటి టీడీపీ పంచన రాధా చేరడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాదు రాధాకు ఏ నియోజకవర్గం టికెట్ ఇస్తారనేదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా టీడీపీలో ఉండేదానికన్నా జనసేనలో చేరడమే బెటర్ అని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఎన్నికల సమయానికి రాధా టీడీపీకి గుడ్ బై చెప్తారనే ప్రచారం సైతం లేకపోలేదు.
మిత్రులు ఒత్తిడికి తలొగ్గేనా?
ఇదిలా ఉంటే వైసీపీలో ఉన్న మాజీమంత్రి కొడాలి నాని, వైసీపీ సానుభూతిపరుడు వల్లభనేని వంశీ, మరో మాజీమంత్రి పేర్ని నానిలతో వంగవీటి రాధాకు సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు మంచి స్నేహం ఉంది. టీడీపీలో ఉన్నప్పటికీ మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధాకు మంచి స్నేహం ఉంది. బెజవాడ నుంచి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో వీరికి ఉమ్మడి సన్నిహితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు మిత్రులు సమయం దొరికినప్పుడల్ కలుస్తూ ఉంటారు. గుడివాడలో వంగవీటి రంగా కార్యక్రమాల్లో వంగవీటి రాధాతోపాటు వల్లభనేని వంశీ, కొడాలి నానిలు సైతం పాల్గొంటారు. అంతేకాదు మిత్రులు, అనుచరుల కుటుంబాల వేడుకల్లో సైతం తరచూ కలుస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వైసీపీలో కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి వంగవీటి రాధాను వైసీపీలో చేరేలా ఒత్తిడి పెంచుతారని తెలుస్తోంది. అయితే వైసీపీని కాదని ఒకప్పుడు వచ్చేసిన వంగవీటి రాధా మరోసారి వైసీపీలో చేరుతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జనసేనలో చేరతారా?
గతేడాది జూలై 1న జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వంగవీటి రాధాను కలిశారు. నేరుగా రాధా నివాసానికి వెళ్లి సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. దీంతో వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు జూలై 4న వంగవీటి రంగా జయంతి సందర్భంగా ఆ రోజున జనసేన తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అవేమీ ఫలించలేదు. వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నారు. ఇటీవలే లోకేశ్ యువగళం పాదయాత్రలో సైతం మెరిశారు. దీంతో అసలు వంగవీటి రాధా పొలిటికల్ ప్లాన్ ఏంటి అనేదానిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. అయితే వంగవీటి రాధా ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదు. అయితే పవన్ కల్యాణ్, వంగవీటి రాధాలతో కూడిన ఫ్లెక్సీలను మాత్రం అభిమానులు వేస్తున్నారు. దీంతో ఎప్పటికకైనా వంగవీటి రాధా జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. మెుత్తానికి వంగవీటి రాధా తన అనుచరులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం చూస్తుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. టీడీపీలోనే కొనసాగుతారా? అనుచరుల ఒత్తిడి మేరకు జనసేనలో చేరతారా? సోదరి కోసం తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతారా అనేది చర్చగా మారింది.