సీమలోనా?.. ఉత్తరాంధ్రలోనా?.. జనసైనికుల్లో సర్వత్రా ఉత్కంఠ

by srinivas |   ( Updated:2023-02-10 14:14:08.0  )
సీమలోనా?.. ఉత్తరాంధ్రలోనా?.. జనసైనికుల్లో సర్వత్రా ఉత్కంఠ
X
  • జనసేన ఆవిర్భావ సభ వేదికపై మల్లగుళ్లాలు
  • పదో వసంతంలోకి జనసేన పార్టీ
  • ఆవిర్భావ సభ ఎక్కడ అనేదానిపై చర్చ
  • తిరుపతిలో ఏర్పాటు చేయాలని పలువురు ఒత్తిడి
  • విశాఖలో ఏర్పాటు చేయాలని ఇంకొందరు ప్రపోజల్
  • ఆవిర్భావ సభ వేదికపై పవన్ దిశానిర్దేశం
  • మినీ మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్
  • వారాహి యాత్ర ప్రారంభోత్సవంపై ప్రకటన
  • అన్నీ కుదిరితే పొత్తులపైనా ప్రకటన విడుదల చేసే ఛాన్స్

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ 9 వసంతాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జనసేన పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ బహిరంగ సభ వేదికగా పార్టీ భవిష్యత్ కార్యచరణ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని తెలుస్తోంది. అంతేకాదు వారాహియాత్రపైనా సంచలన ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పొత్తులతో కలిసి పోటీ చేస్తారా లేక సింగిల్‌గా పోటీ చేస్తారా అన్నదానిపై కూడా క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సభ వేదికగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తారని, ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జనసేన నాయకత్వం ఎన్నికల సమరంపై కార్యకర్తలను, నేతలను సన్నద్ధం చేయబోతుందని తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ వేదిక ఎక్కడ ఏర్పాటు చేస్తారనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఉత్తరాంధ్రలో ఆవిర్భావ సభ నిర్వహిస్తారని కొందరు.. లేదు రాయలసీమలో ఏర్పాటు చేస్తారని మరికొందరు వాదిస్తున్నారు.

సభపై సర్వత్రా ఉత్కంఠ

జనసేన పార్టీ ఆవిర్భావ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆవిర్భావ సభకు భారీగా జనసమీకరణ సైతం జనసేన చేస్తోంది. ఇదే వేదికపై జనసేనాని పవన్ కల్యాణ్ భవిష్యత్ కార్యచరణ అలాగే మినీ మేనిఫెస్టో ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నెలరోజుల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభ నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన నాయకులు ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణపై పెద్ద కసరత్తే చేస్తున్నారు.ఈ సభ వేదికగా పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారని సర్వత్రా అభిమానులు, పార్టీ శ్రేణులు ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. అందులోనూ పార్టీ 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ సభ వేదికగా పవన్ ఇచ్చే స్పీచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో అనుసరించవలసిన వ్యూహాలపై పవన్ కల్యాణ్ ముఖ్య ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతుంది.

విశాఖనా..?.. తిరుపతినా?

జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎంత ముఖ్యమో అదే సమయంలో సభా వేదిక కూడా ఎక్కడ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఇప్పటంలో జనసేన పార్టీ నిర్వహించిన ఆవిర్భావ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. సభ జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటం గ్రామం ఇప్పటకీ వార్తల్లో నిలుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

అయితే విశాఖపట్నంలో ఆవిర్భావ సభ నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని కొందరు సూచిస్తున్నారట. ఇప్పటికే 'యువశక్తి' సభ సక్సెస్ అయ్యిందని, అదే తరుణంలో విశాఖలో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతున్న నేపథ్యంలో విశాఖలో ఏర్పాటు చేస్తే బెటర్‌ అనే ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుపతిలో ఏర్పాటు చేస్తే బెటర్ అని మరికొందరు సూచిస్తున్నారట. తిరుపతి నియోజకవర్గం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందనే ప్రచారం ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన సొంతూర్‌లో ఓటమి పాలైనా తిరుపతిలో మాత్రం ఘన విజయం సాధించారు. అంతేకాదు తిరుపతిలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని విధాలుగా తిరుపతి అయితే మంచిదని సూచిస్తున్నారట.

Also Read..

Nara Lokesh Yuvagalam: రీబిల్డ్ ఏపీని పునర్నిర్మిస్తాం

Advertisement

Next Story