Breaking: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎంగా ఆరోజే పవన్ బాధ్యతలు

by srinivas |   ( Updated:2024-06-16 15:54:22.0  )
Breaking:  ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..  డిప్యూటీ సీఎంగా ఆరోజే పవన్ బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలు దక్కాయి. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కానీ బాధ్యతలు తీసుకోలేదు. దీంతో పవన్ ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారా అని జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 19న పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన లేఖను సైతం విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా అన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed