జై భరత్ మేనిఫెస్టో విడుదల.. ప్రవేశపెట్టనున్న పథకాలు ఇవే..

by Indraja |
జై భరత్ మేనిఫెస్టో విడుదల.. ప్రవేశపెట్టనున్న పథకాలు ఇవే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజు జై భరత్ మేనిఫెస్టో విడుదలైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జేడీ నారాయణ జై భరత్ నేషనల్ పార్టీ ప్రజలకు అందించనున్న పథకాల గురించి తెలియ చేశారు. జై భరత్ నేషనల్ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించడడం అని జేడీ నారాయణ వెల్లడించించారు.. ఇందులో భాగంగా ప్రతి పంచాయితీకి 10 చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ప్రతి నియోజక వర్గానికి ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.

గతంలో రాజకీయ నాయకులు తమకు నచ్చిన ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవాళ్ళని ఆరోపించిన ఆయన.. జై భరత్ నేషనల్ పార్టీ మొత్తం ఆంధ్రపరదేశ్ రాష్ట్రాన్ని చక్కగా ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటుందని.. అందుకే ప్రతి పంచాయితీలో, ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు చేసి.. ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటుందని తెలియ చేసారు.

ఇక గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అందుబాటులో ఉంటుందని కానీ పట్టణాల్లో ఆ పథకం లేదని వెల్లడించిన ఆయన.. మొదటిసారిగా పట్టణ ఉపాధి హామీ పథకం కూడా అమలు చేస్తామని ధైర్యంగా జై భరత్ నేషనల్ పార్టీ తెలియచేస్తుందన్నారు. పట్టణ ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో100 రోజుల ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఇక జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతూ.. జాబ్ నోటిఫికెషన్స్ షెడ్యూల్ ప్రకారం ఇస్తామని తెలియ చేశారు.

జాబ్ షెడ్యూల్ రిపబ్లిక్ డే నుండి మొదలవుతుందని.. అంటే జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్భంగా గ్రూప్ 1 నోటిఫికెషన్స్, అలానే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రూప్ 2 నోటిఫికెషన్స్, కాగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా DSC నోటిఫికెషన్స్, అక్టోబర్ 21న సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా కానిస్టేబుల్, ఎసై నోటిఫికెషన్స్ విడుదల చేస్తామని తెలియచేసారు.

అనంతరం మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో యువతరం మద్యం మత్తులో తూగుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. ఇక పై ఆంద్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం మహిళల చేతుల్లోనే ఉన్నదని తెలిపిన ఆయన.. మహిళల చేతిలో మద్యపాన పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆ పథకం ద్వారా పంచాయితీల్లో, మున్సిపాలిటీల్లో నిర్వహించే సర్వసాధారణ సభల్లో 50 శాతం మంది మహిళలు వాళ్ళ ప్రాంతంలో మద్యం షాపులు వద్దు అని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ షాపులను మూసివేయడం జరుగుతుందని, అలానే పర్మిట్ విధానాన్ని ప్రవేశ పెడతామని పేర్కొన్నారు.

ఇక గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కోటి రూపాయల గ్రాంట్ ను ఇస్తామని పేర్కొన్నారు. అలానే ఏకగ్రీవ ఎన్నికతో వివాదాలు లేని ప్రతి గ్రామ పంచాయితీకి రూ/ 25 లక్షల ప్రోత్సహం కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి మండలం నుండి మోడల్ గ్రామాలకు కోటి రూపాయల ప్రోత్సహం ఇవ్వబడుతుందని తెలిపారు. సబ్సీడీ పై ప్రతి ఇంటికి సోలార్ పానెల్స్, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం, ఇక ప్రతి నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి హాస్పిటల్, ప్రతి జిల్లాకు AIMS స్థాయి హాసిపిటల్ నిర్మిస్తామని వెల్లడించారు. అలానే ప్రతి మండలం లో ప్రభుత్వ మెడికల్ షాప్, సంయుక్త భాగస్వామ్యం ద్వారా ఆరోగ్య భీమా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story