- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Jagan కొత్త మేనిఫెస్టో అదిరిపోయిందిగా.. వాళ్లకి డబ్బే డబ్బు
దిశ,వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గర పడటంతో అధికార పార్టీలు కొత్త మేనిఫెస్టో లు రెడీ చేసుకుంటున్నాయి. ఓ వైపు తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో వైపు ఏపీలో సీఎం జగన్ కూడా మేనిఫెస్టోలు సిద్ధం చేసుకుంటున్నారు. వాలంటీర్లకు జీతాలు పెంచడం, వృద్ధాప్య పెన్షన్లను నాలుగు వేలు చేయడం వంటి స్కీమ్స్ గురించి ఆలోచిస్తున్నారు.
వాలంటీర్లు గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేశారు. కానీ అప్పుడు పెంచనని తేల్చి చెప్పేసారు. కానీ ఇప్పుడు ఓట్లేస్తారో లేదోనన్న సందేహంతో జీతం పదివేలు చేస్తానంటూ ఎన్నికల హామీగా మాట ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లను నాలుగు వేలు చేయాలని అనుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు పెన్షన్ మూడు వేలు చేస్తానన్న జగన్ నాలుగున్నరేళ్లుగా పెంచుకుంటూ వస్తూ.. ఇప్పుడు 2750 దగ్గరకు వచ్చారు. ఎన్నికలకు వెళ్లే ముందు మూడు వేలు చేస్తారు. దాన్ని నాలుగు వేలు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.