- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది జగన్.. దాడిని ఖండించిన మాజీ మంత్రి గంటా
దిశ, డైనమిక్ బ్యూరో: రాప్తాడులో ఫోటో జర్నలిస్ట్ పై మూక దాడి హేయమైన చర్య అని, దీంతో మీ ప్రభుత్వ పాలనకు ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ పై దాడి అంశం మీద ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న రాప్తాడులో విధుల్లో ఉన్న ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణపై వైసీపీ మూకలు చేసిన దాడి హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన మీడియాపై జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన వైఫల్యాలు, నేతల అవినీతిని వెలికి తీసిన వారిపై కక్ష సాధిస్తున్నారని, జగన్ అధికారంలోకి వచ్చాక మీడియా ప్రతినిధులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని తెలిపారు.
అక్కడ అంతలా దాడి జరుగుతున్నా పోలీసులు నిలువరించకపోవడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందని తెలియజేశారు. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఇసుక మాఫియా గురించి వార్త రాసేందుకు వెళ్లిన విలేకరిపై తీవ్రంగా దాడి చేశారని, రాష్ట్రంలో మీ దౌర్జన్యకాండకు హద్దు అదుపు లేకుండా పోయిందని బగ్గుమన్నారు. ఇక రాప్తాడులో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరాచకాలు, విధ్వంసాలతో ప్రారంభమైనా మీ ప్రభుత్వ పాలనకు "ఎక్స్పైరీ డేట్" దగ్గర పడిందని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు..అంటూ రాసుకొచ్చారు.