మద్యం దందాతో రూ.60 వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ : మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సంచలన ఆరోపణలు

by Shiva |
మద్యం దందాతో రూ.60 వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ : మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒక్క మద్యం దందాతోనే రూ.60 వేల కోట్ల అవనీతికి జగన పాడ్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఇవాళ నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఛాన్సంటూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు దగా పడ్డాయని ఆరోపించారు. రాష్ట్రంలోని దళితులు బడుగు, బలహీన వర్గాలపై వైసీపీ నేతలు దారుణాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. పన్నుల పేరిట మోయలేని భారాన్ని ప్రజలపై వేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దాదాపు రూ.12లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని, ఆ డబ్బును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ పారదర్శకంగా ఉండేదని, ఇప్పుడు ప్రతి డిస్టిలరీని వైసీపీ నేతలే నిర్వహిస్తున్నారని అన్నారు. కేవలం ఒక్క మద్యం ద్వారానే రూ.60 వేల కోట్ల అవినీతికి జగన్ పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గ్రహించి టీడీపీ-జనసేన కూటమిని ప్రజలు అధికారంలోకి తీసుకురావాలి అని బొండా ఉమా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story