- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాసిరెడ్డి మద్యంతో జగన్ రెడ్డి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు: మాజీ మంత్రి సోమిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : జగన్ రెడ్డి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. జగన్ ప్రతి ఇంటికి వెళ్లి నేనే మీ ఆరోగ్యాన్ని కాపాడతానని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఏమీ అభ్యంతరంలేదు. వైద్యం అందక ఆశ వర్కర్ ఒక అమ్మాయి చనిపోయింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సోమిరెడ్డి అన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు జగనే సురక్ష అని ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణ శూన్యం అని మండిపడ్డారు. వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీకి దిక్కులేదు అని ధ్వజమెత్తారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో, కిమ్స్ రెండు ఆసుప్రతుల్లోను ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడంలేదు. జగనన్న వచ్చాక వద్దు, మేం తీసుకోము అంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. నేడు ప్రజల ఆరోగ్యం పణంగా పెట్టి దాదాపు చీప్ లిక్కర్ 41 వేల కోట్ల దోపిడి చేశారు. సేల్స్ చూపించకుండా తగ్గించి చూపించి ప్రతి సంవత్సరం 7 వేల కోట్లు దోపిడీ జరుగుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేవు. ఆంధ్రప్రదేశ్ లో కరెన్సీ నోట్లు ఇస్తే తప్ప మద్యం ఇవ్వరు. మద్యం షాపుల్లో రసీదు ఇవ్వరు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. అక్రమ సంపాదన కోసం నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తావా జగన్ రెడ్డి?మద్యనిషేదం అంటూ సొల్లు కబుర్లు చెప్పి నేడు నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు అని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
మద్యం మరణాలివే
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నరేల్లలో వందలాంది మంది ప్రాణాలు కోల్పాయారు అని ఆరోపించారు. ఒక్క విశాఖ కేజీహెచ్ లో ఏడాదిలో 36 మంది చనిపోయారని చెప్పుకొచ్చారు. ఉదరకోశ వ్యాధుల విభాగంలో 2021 జులై నుంచి 2022 జూన్ మధ్య 1,060 మంది చేరగా.. వారిలో 471 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరినవారేనని ఆరోపించారు. ఏడాది వ్యవధిలో వారిలో 36మంది చనిపోయారని అధికారులు చెబుతున్నా.. వారానికి ఇద్దరు చనిపోతున్నారని సిబ్బంది చెబుతున్నారు. కేజీహెచ్ ఉదరకోశ వ్యాధుల విభాగం వార్డులో 37 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో 25 మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది అని మండిపడ్డారు. మద్యం బాధిత అనారోగ్య సమస్యల ఉపద్రవం రాష్ట్రాన్ని ముంచెత్తుతోంది అని విరుచుకుపడ్డారు. బాధితుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పేదలేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.