- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ఇక తాడేపల్లిలో ఉండరా..! మారిన వైసీపీ కేంద్ర కార్యాలయం
దిశ ప్రతినిధి, అమరావతి: వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. తాడేపల్లిలోని తన నివాసం పక్కన ఉన్న క్యాంప్ ఆఫీస్‌కు మార్చాలని ఆదేశించారు. ఈ నెల 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు జరపాలని వైఎస్ జగన్ వైసీపీ ముఖ్య నేతలను ఆదేశించారు. ప్రస్తుతం తాడేపల్లిలోనే 16వ నెంబర్ జాతీయ రహదారికి అవతల వైపున వైసీపీ కేంద్ర కార్యాలయం ఉంది. కార్యాలయానికి, జగన్ ఇంటికి కి.మీ పైగా దూరం ఉంటుంది, అక్కడికి జాతీయ రహదారి అండర్ పాస్ నుంచి వెళ్లాలి. ఇంటి పక్కనే ఉండడం సౌకర్యవంతంగా ఉందనే అభిప్రాయంతో కార్యాలయాన్ని మారుస్తున్నారని అంటున్నారు. అంతేగాక ఇప్పుడున్న కార్యాలయం అద్దె భవనంలో ఉందని, ఇప్పుడు సొంత భవనంలోకి వస్తుందని చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అద్దె సకాలంలో చెల్లించకపోవడం, కార్యాలయం సిబ్బందికి నెలల పాటు జీతాలు ఇవ్వకపోవడం లాంటివి జరిగాయి. ఆ నేపథ్యంలో అద్దె భారం తగ్గించుకొనేందుకు పార్టీ కార్యాలయం మారుస్తున్నట్లుగా తెలుస్తోంది.
2014 ఓటమి తరువాత ఆఫీసు మార్పు
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అద్దె భవనంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేసి లోటస్ పాండ్‌లోని తన నివాసానికి జగన్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే రకంగా ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత కార్యాలయం మార్పునకు అదేశాలు జారీ చేశారు. వేతనాల భారం తగ్గించుకొనేందుకు ఇప్పుడు మీడియా సలహాదారుగా ఉన్న జీవీడీ కృష్ణ మోహన్‌తో పాటు పలువురిని అప్పట్లో తప్పించారు. కార్యాలయ సిబ్బందిలో కూడా బాగా కోత పెట్టారు.
తాడేపల్లిలో నివాసం ఉండే ఉద్దేశం లేదా?
కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో పెడుతుండడంతో ఇక జగన్ పెద్దగా తాడేపల్లిలో ఉండరేమో అన్న ప్రచారం ఊపందుకొంది. సహజంగా తన ఇంటికి పెద్దగా జనం రావడం ఇష్టపడని జగన్ ఇంటి ప్రాంగణంలోకే కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయం తీసుకొన్నారంటే ఆయనకు అక్కడ ఉండే ఉద్దేశం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యాలయం అంటే వందల సంఖ్యలో కార్యకర్తలు, జనం వచ్చిపోతుంటారు. అటువంటి దానిని ఇంటి ప్రాంగణంలోకి తెస్తున్నారంటే జగన్ ఎక్కువ రోజుల అక్కడ వుండరనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.