జగన్ సైకో అని తెలిసే.. అంబటి రాయుడు రాజీనామా : బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-01-06 07:57:04.0  )
జగన్ సైకో అని తెలిసే.. అంబటి రాయుడు రాజీనామా : బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ సైకో అని తెలిసే పార్టీలో చేరిన వారం రోజులకే అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అంబటి రాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతల సమావేశమవగా ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. తిరువూరులో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తున్నామని తెలిపారు.

2024లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తమ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తెలుగుదేశంలో పదవులు ఇవ్వడంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని బుద్ధా వెంకన్న వెల్లడించారు. రాజకీయంగా టీడీపీలో ఉన్న బీసీ నేతలకు.. వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలికే లేదని అన్నారు. రాజ్యసభలలో ఫ్లోర్ లీడర్ పదవి ఆర్.కృష్ణయ్యకు ఎందుకు ఇవ్వలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

Advertisement

Next Story