డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంలో జగన్ హస్తం

by Indraja |
డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంలో జగన్ హస్తం
X

దిశ ప్రతినిధి , విశాఖపట్నం: మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ గండి బాబ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ లో ఎప్పటినుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతుందని పేర్కొన్నారు. ఎక్కడ గంజాయి పట్టుబడిన వాటి మూలాలు విశాఖ లో కనిపిస్తున్నాయని తెలిపారు. ఇక ప్రస్తుతం విశాఖ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే సీబీఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.

డ్రగ్స్ మాఫియా తతంగాన్ని మాయచేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారం లో ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని, సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి కూనం పూర్ణచంద్రరావుకు వైసీపీ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. అలానే విశాఖ లోని అనేక కళాశాలలలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని.. మత్తుపదార్థాలలో ఆంధ్రప్రదేశ్ ను జగన్ నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లారని మండిపడ్డారు.

జగన్ కారణంగా యువత, విద్యార్థులు మత్తుపదార్ధాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని,మరో సారి జగన్ కు అవకాశం ఇస్తే విశాఖ మరింత నాశనం అవుతుంది అని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో పొరపాటున జగన్ కు ఓటు వేస్తే జీవితాలను నాశనం చేసుకున్నట్లే అని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రభుత్వ అధికారులు వైసీపీ పార్టీ నాయకులకు మద్దతుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార దుర్వినియోగనికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులు పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story