AP News:‘జగన్ తాను తీసుకుంటున్న రాజకీయ గోతిలో తానే పడుతున్నాడు’:మంత్రి సత్య కుమార్

by Jakkula Mamatha |   ( Updated:2024-11-14 09:54:54.0  )
AP News:‘జగన్ తాను తీసుకుంటున్న రాజకీయ గోతిలో తానే పడుతున్నాడు’:మంత్రి సత్య కుమార్
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ సీఎం జ‌గ‌న్(YS Jagan) తాను తీసుకుంటున్న రాజకీయ గోతిలో తనే పడుతున్నాడని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Health Minister Satya Kumar Yadav) పేర్కొన్నారు. తన రాజకీయ సమాధిని తానే తవ్వుకుంటున్నాడని అన్నారు. ఎన్డీయే పేరులోనే ప్రజాస్వామ్యం ఉంది. పాలనకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరే ఏ గొంతును అణగదొక్కాలనే ఉద్దేశం మాకు లేదు అని మంత్రి సత్య కుమార్ తెలిపారు. అటువంటి విధానాల పై మాకు నమ్మకం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక లక్షణం. రాజకీయంగా మళ్లీ లాభపడే ఉద్దేశంతో అరెస్టు అవ్వాలని, ఆ విధంగా వ్యవస్థ స్పందించాలనే దురుద్దేశంతో జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అతనికి నిరాశే మిగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ఎవరైనా సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటోంది. వైఎస్ జగన్ డ్రామాలు ఆపాలి అని సూచించారు. జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి కూడా తగిన వ్యక్తి కాదని ఏపీ ప్రజలు భావించారు కాబట్టే.. ఆ హోదాను పొందేందుకు 18 సీట్లు అవసరమైతే, ప్రజలు 11 సీట్లు ఇచ్చారు అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తకుండా తన బాధ్యతలను మరిచి పారిపోతున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు ఏ మాత్రం గౌరవం లేకపోవడమే ఇందుకు కారణం అంటూ విమర్శలు గుప్పించారు.

Advertisement

Next Story