జగన్ సర్కార్‌కు మానవత్వం లేదు: చంద్రబాబు నాయుడు

by Mahesh |
జగన్ సర్కార్‌కు మానవత్వం లేదు: చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక మృతిపై కుటుంబానికి పరిహారం వద్దంటూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం పై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఒక నిరుపేద బాలిక మరణిస్తే... ఆ బాలిక కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ ఆదేశించిందని గుర్తు చేశారు. అయితే పరిహారం ఇవ్వడం కుదరదంటూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం సిగ్గుచేటన్నారు.

ఇదేనా మీ సంక్షేమ ప్రభుత్వం? కనీస మానవత్వం కూడా లేదా? కోర్టుకు రాకుండా ఉండాల్సిందని హైకోర్టు ప్రశించిందంటే ఎంత సిగ్గుచేటు అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇకపోతే చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లిల అంగన్ వాడి కేంద్రంలో కోడిగుడ్డు తిని చిన్నారి మరణించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టని హెచ్‌ఆర్‌సీ మరణించిన చిన్నారి కుటుంబానికి రూ.8 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story