AP:పేదలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది :నారా భువనేశ్వరి

by Jakkula Mamatha |   ( Updated:2024-08-15 15:56:56.0  )
AP:పేదలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది :నారా భువనేశ్వరి
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రోజే ఏపీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు గుడివాడ మున్సిపల్ పార్కులో నెలకొల్పిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం నారా భువనేశ్వరి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

అనంతరం మేము ఇద్దరం కలిసి భోజనాలు వడ్డించామని, టోకెన్లు కూడా తీసుకుని అన్న క్యాంటీన్‌లోనే భోజనం చేశామని వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రజలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని నారా భువనేశ్వరి తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ప్రారంభమైన అన్న క్యాంటీన్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కోరుకుంటున్నాను అన్నారు. సామాన్యులందరికీ కేవలం 5 రూపాయలకే రుచి, శుచి కలిగిన భోజనం అందుబాటులోకి రావాలి. రాష్ట్రంలో పేద వాళ్లందరికీ ఆహార భద్రత లభించాలని నారా భువనేశ్వరి కోరారు.

Advertisement

Next Story

Most Viewed